రుక్మాపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ

19-10-2026 | 09:05am

చొప్పదండి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) పండుగను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చి, పాటలు పాడుతూ కోలాటాలతో (Traditional Dance) సందడి చేశారు. సర్పంచ్ కర్రె ప్రేమలత శ్రీనివాస్ పర్యవేక్షణలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని చిన్నారులు, యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను (Telangana Culture) ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. పండుగ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహిళల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు (Festival Wishes) తెలిపారు.

మరిన్ని వార్తలు