చెన్నైలో కుండపోత.. తమిళనాడుకు రెడ్ అలర్ట్‌!

19-10-2026 | 07:24am

తమిళనాడులో భారీ వర్షాలు (Heavy Rains) జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని చెన్నైలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. చెన్నైతో పాటు చెంగల్పట్టు, తిరువళ్లూరు, నీలగిరి, కోయంబత్తూరు, తేని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరో 26 జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. శనివారం కురిసిన వర్షాలతో చెన్నై, శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు నివాసాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు మోటార్ పంపులు, వరద నీటి కాలువల (Storm Water Drains) ద్వారా నీటిని తొలగిస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు తెలిపారు. పాఠశాలల సెలవులపై వాతావరణ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ (Rajmohan) వెల్లడించారు.

మరిన్ని వార్తలు