పనుల్లో నాణ్యత లోపించకూడదు
ముకరంపుర, అక్టోబర్ 23(విజయక్రాంతి) : కరీంనగర్ నగర పాలక సంస్థ(Karimnagar Municipal Corporation) పరిధిలోని 50వ డివిజన్ జ్యోతి నగర్ ప్రాంతంలో ముమ్మరంగా సాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను(CC road construction work) స్థానిక కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు(Boyinapalli Praveen Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులతో కాంట్రాక్టర్లతో మాట్లాడారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం పనులు జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్థానికులకు ఎలాంటి రాకపోకల ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.