ఎల్‌సీడీసీ కార్యక్రమం ప్రారంభం

22-10-2026 | 08:14pm

కొత్తపల్లి, అక్టోబర్ 22(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ(Health Department) అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు(Health Department official Dr. Rajagopal Rao)  ఆధ్వర్యంలో, యూపీహెచ్‌సీ మోతాజ్ ఖానాలో కుష్టు వ్యాధి గుర్తింపు ప్రచార కార్యక్రమంను(Promotional Campaign) గురువారం  రోజున ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు  మాట్లాడుతూ ప్రజల్లో కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించడం, అనుమానిత కేసులను గుర్తించి తగిన వైద్య చికిత్స అందించడం ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమన్ని ఈ నెల 22 తేదీ నుండి నవంబర్ 4వ తేదీ వరకు 14 రోజులపాటు నిర్వహించబడుతుంది.

ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది కుష్టు వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి, పూర్తిస్థాయిలో చికిత్స పొందడం ద్వారా వైకల్యాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు. కుష్టు వ్యాధి పట్ల అపోహలు, వివక్ష విడనాడి, లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇమ్రాన్ ఖాన్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు