మార్కెట్ కమిటీ చైర్మన్ ను పరామర్శించిన మంథని ఆర్డీఓ
వైనాల సాంబయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు
కమాన్పూర్, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Kamanpur Agricultural Market Committee) చైర్మన్ వైనాల రాజు తండ్రి వైనాల సాంబయ్య మృతి పట్ల మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) సురేష్ సంతాపం వ్యక్తం చేశారు. గురువారం వైనాల రాజు నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా సాంబయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. సాంబయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న పాల్గొని వైనాల రాజు కుటుంబానికి సానుభూతి తెలిపారు. వారి వెంట కమ్మగోని చౌదరి గౌడ్, పర్శవేన మోహన్ యాదవ్, బొజ్జ సతీష్, సోప్పరి సంతోష్, భూస తిరుపతి, లల్లు తదితరులు పాల్గొన్నారు.