ఆర్ అండ్ బి రోడ్ల విస్తరణ పనులకు భూమి పూజ

22-10-2026 | 09:37pm

ఎర్రుపాలెం అక్టోబర్ 22 (విజయ క్రాంతి): మండలం కేంద్రంలోని ఆర్ అండ్ బి రోడ్ల విస్తరణకు పనులకు త్వరలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) భూమి పూజ చేనున్నట్లు మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు పేర్కొన్నారు.శంకుస్థాపన పైలాన్ నిర్మాణ స్థలాలను ఆర్ అండ్ బి. డి ఈ రాంబాబు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డితో కలిసి గురువారం నాడు  స్థలాన్ని పరిశీలించారు. 

ఎర్రుపాలెం నుండి  గంగినేని రోడ్డు రెండు లైన్ల రహదారి కొరకు  22 కోట్లు, ఎర్రుపాలెం నుండి మధిర  నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కొరకు 110 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బండారు నరసింహారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్,నండ్రు వెంకటేశ్వరరావు,జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ  కంచర్ల వెంకట నరసయ్య,కడియం శ్రీనివాసరావు, షేక్ షా భాష, గుర్రాల పుల్లారెడ్డి ,కోటపాటి తిరుమల్ రావు,దేవరకొండ రాజీవ్ గాంధీ,మొగిలి అప్పారావు,సముద్రాలు పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు