కార్మికులకు కేటీఆర్ భరోసా

22-10-2026 | 08:26pm

హైదరాబాద్‌: సింగరేణి సంస్థ(Singareni Company)ను ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాపాడటంతో పాటు బొగ్గు గని కార్మికుల(Coal mine workers) హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, టీబీజీకేఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. గోదావరిఖనిలో నిర్వహించిన కార్మిక గర్జన సభ విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

సింగరేణిలో టెండర్ల వ్యవహారాలు, ఆర్థిక అంశాలు, కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) నిలదీయాలని కేటీఆర్ సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కార్మిక సంక్షేమ పథకాలను(Welfare schemes) ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే కార్మిక సంఘం ఎన్నికలకు సిద్ధం కావాలని, సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

మరిన్ని వార్తలు