ఇందిరాగాంధీ వర్ధంతి..కాంగ్రెస్ శ్రేణుల నివాళి
కూసుమంచి, అక్టోబర్ 31: కూసుమంచి మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi Death Anniversary) వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంతోపాటు ఎండీ హాఫీజుద్దీన్ నివాసంలోని మినీ గాంధీభవన్ వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
క్యాంపు కార్యాలయ ఇన్చార్జి భీమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఎండీ హాఫీజుద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్, ఉపసర్పంచ్ చెన్ను వెంకటరమణ తదితర నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి (Floral Tributes) ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆమె నాయకత్వం (Leadership), దేశాభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేసుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆమె పోషించిన పాత్రను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వెంకన్న, పెండ్ర అంజయ్య, బెల్లంకొండ శరత్ గౌడ్, పీర్యానాయక్, చాట్ల పరుశురాం, శేఖర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, భూపాల్‌రెడ్డి, చంద్రయ్య, కిరణ్ గౌడ్, మీరా, కొర్రా రమేష్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.