శివాలయంలో మువ్వా విజయబాబు ప్రత్యేక పూజలు
సత్తుపల్లి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని గుడిపాడు రోడ్డులో ఉన్న శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో టీజీఐడీసీ (TGIDC) మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు పాల్గొని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, భక్తులు, మొదటి వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.