ఖేలో ఇండియా జూనియర్ ఖో-ఖో నేషనల్ క్యాంప్ కు భీమవరం విద్యార్థులు
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండలం పరిధిలో భీమవరం వేమిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు తల్లపురెడ్డి. సంజన 8 వ తరగతి విద్యార్థిని ఖేలో ఇండియా ఖో-ఖో నేషనల్ క్యాంప్(National Kho-Kho Camps) 45 రోజులు, శీలం. తేజశ్రీ 10 వ తరగతి విద్యార్థిని జూనియర్ ఖో-ఖో నేషనల్ క్యాంప్ 15 రోజులు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం హైదరాబాద్ నందు హాజరు అగుటకు నేడు బయలుదేరి వెళ్లారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ ఉపేందర్, పి డి నరాల సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.
అక్కడ జరిగే శిక్షణా శిబిరం లో కూడా మంచి ప్రతిభను కనబర్చి తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని గ్రామ పంచాయతీ సర్పంచ్ వంగల నాగేశ్వరరావు వైస్ సర్పంచ్ గుర్రాల. శ్రీనివాసరెడ్డి ఏఏపిసి చైర్మన్ తులిసమ్మ పాఠశాల సిబ్బంది గ్రామ పెద్దలు విద్యార్థినిల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అభినందనలు తెలియజేసినారు.