4 September, 2026 | 10:29 PM

Breaking News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •   అంజన్న భక్తులకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్   •   సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు   •  

కాంగ్రెస్ అబద్ధపు హామీలపై పోరాటం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి

01-09-2026 | 12:41pm

జిల్లా , నియోజకవర్గ,మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపు 


ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova Lakshmi) ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 1000 రోజుల ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై నియోజకవర్గంలోని నాయకులతో మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోవా లక్ష్మీ మాట్లాడుతూ ఎన్నికల గ్యారెంటీ ప్రకారం ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడ్డదని అన్నారు.


బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District) వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి గళం విప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు మార్సుకోలా సరస్వతి, మున్సిపల్ చైర్మన్ ఆకాష్ వైస్ చైర్మన్ అహ్మద్ సింగల్ విండో చైర్మన్లు అలీబిన్ హైమద్, సంజీవ్, పార్టీ అధ్యక్షులు రవీందర్, అజయ్ కుమార్, ఇంతియాజులాల, శ్రీధర్ రెడ్డి, హనుమంతరావు,కౌన్సిలర్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు హైమద్, నాయకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.