4 September, 2026 | 10:40 PM

Breaking News

మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •  

సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

04-09-2026 | 09:32pm

కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు

భజనలు, కీర్తనలతో పురవీధుల్లో శోభాయాత్ర

ఇచ్చోడ,(విజయక్రాంతి): ఇచ్చోడ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల(Sri Saraswati Shishu Mandir School)లో యాజమాన్యం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను(Sri Krishna Janmashtami celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలురు చిన్ని కృష్ణుని వేషధారణలో, బాలికలు గోపికల వేషధారణలో సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీకృష్ణుని భజనలు, కీర్తనలతో చిన్నారులు పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. శివాజీ చౌక్, విఠల్–రుక్మిణీ మందిరంతో పాటు పాఠశాల ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మికవేత్త బొడ్డు భోజన్న ముఖ్య వక్తగా పాల్గొని విద్యార్థులు, పోషకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను వివరించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన ఉపదేశాలను మానవ జీవితానికి అన్వయించుకొని, జీవిత పరమార్థాన్ని తెలుసుకుని సన్మార్గంలో నడవాలని సూచించారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.