4 September, 2026 | 11:06 PM

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం

04-09-2026 | 10:19pm

జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ ఉత్సవ సమితి( Sri Krishna Utsav Samiti) ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పానుగంటి ముత్తయ్య అధ్యక్షతన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు(Sri krishna janmashtami celebrations) అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి. నెహ్రూ పార్క్ నుండి ప్రారంభమైన స్వామివారి రథ ఊరేగింపు డోలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలతో బతుకమ్మ కుంట వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర కోలాహలంగా సాగింది. ఈ ఊరేగింపులో జిల్లా నలుమూలల నుండి వేలాది మంది యాదవులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former Minister Talasani Srinivas Yadav) మాట్లాడుతూ "యాదవులంతా ఒకే తాటిపైకి రావాలి.

ఇలాంటి వేడుకలు మన ఐక్యతను చాటుతాయి. జనగామలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం" అన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Former MP Anjan Kumar Yadav) మాట్లాడుతూ .. మన బిడ్డలను చదువు వైపు నడిపించాలి. చదువుకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత హోదాల్లో స్థిరపడాలి, రాజకీయాల్లో కూడా ముందుకు సాగి ప్రయోజకులు కావాలి" అని పిలుపునిచ్చారు. యాదాద్రి బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్  మాట్లాడుతూ "యాదవులకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలి. రాబోయే మంత్రివర్గ విస్తరణలో మనకు చోటు దక్కేలా ప్రతి యాదవ బిడ్డ కృషి చేయాలి. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించేలా మనమంతా ఏకతాటిపై ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి" అన్నారు.