అటవీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
02-10-2026 | 12:38pm
కాగజ్ నగర్,(విజయక్రాంతి): అటవీ శాఖ కార్యాలయం(Kagaznagar Forest Office)లో గాంధీ జయంతి(Gandhi Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ టి. భార్గవ్ కుమార్(FDO T. Bhargav Kumar) మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ సత్యం, అహింస, శాంతి, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. దేశాన్ని పరిశుభ్రంగా, శాంతియుతంగా ఉంచేందుకు ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.