జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

02-10-2026 | 12:59pm

ఆలేరు,(విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమం(Journalist Welfare), భద్రత, హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (Indian Journalists Union) డిమాండ్ చేసింది. ఐజేయూ పిలుపుమేరకు శుక్రవారం ఆలేరు పట్టణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు జర్నలిస్టులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ కుర్షిత్ పాషా మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఐజేయూ కోరుతున్నట్లు తెలిపారు.

జర్నలిస్టులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐజేయూ భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాలకు అందరూ సహకరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తోట మల్లయ్య, కొరటూరి ఉపేందర్, బైరి విశ్వనాథం, సామల సిద్ధులు, చింతకింది వెంకటేష్, సందెన శంకర్, పోతుగంటి సంపత్ కుమార్, మహమ్మద్ జహంగీర్, మంచెన మల్లేశం, ముళ్లెకల రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు