ఏసీబీకి చిక్కిన జీపీఓ
కాగజ్‌నగర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా జీపీఓ శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు. భూమి వారసత్వ (Land Inheritance) ప్రక్రియకు సంబంధించి రూ.22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మధు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
మండలంలోని మోసం గ్రామపంచాయతీ పరిధిలోని ఆరెగూడ గ్రామానికి చెందిన రైతు చౌదరి మోహన్‌రావుకు సంబంధించిన భూమి వారసత్వ (Land Mutation) వ్యవహారంలో ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో రైతు నుంచి రూ.22 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి జీపీఓ శ్రీనివాస్‌ను పట్టుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి తహసీల్దార్ మధుకర్‌తో పాటు ఇతర సిబ్బందిని కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.