అయ్యప్ప స్వామి దేవాలయం పంచలోహ విగ్రహాలు తయారీ
మఠంపల్లి అక్టోబర్ 29(విజయ క్రాంతి ): మండల కేంద్రంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో(Ayyappa Swamy Temple) గురువారం అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహం దేవాలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో పంచలోహాలను కరగబోసి విగ్రహం తయారు చేసే కార్యక్రమాన్ని శిల్పులు ప్రారంభించారు.గ్రామంలోని వందలాది మంది భక్తులు పంచలోహాలు అందజేశారు.
ఆ లోహాలతోనే దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి విగ్రహం,పీఠం,మకర తోరణం తయారు చేస్తున్నారు.అయ్యప్ప స్వామి విగ్రహం లో వాడేందుకు 180 గ్రాముల బంగారాన్ని దాతలు అందించడంతో దాతల,భక్తుల సమక్షంలోనే బంగారం కరుగబోసి విగ్రహంలో వాడారు విగ్రహాలు పూర్తి అవుతుండడంతో దేవాలయంలో పనులు కూడా పూర్తి కావస్తుండడంతో దేవాలయం, విగ్రహాల ప్రతిష్ట,ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలకు త్వరలో తేదీలను ఖరారు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.
23 సంవత్సరాలుగా దేవాలయం అభివృద్ది నిలిచిపోయి ఆలయం ప్రతిష్ట మహోత్సవాలకు ముస్తాబవుతుండడంతో అయ్యప్ప స్వామి భక్తులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి,విగ్రహ ప్రతిష్ట, మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు అందజేసి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.