అటవీ భూముల సర్వేపై కలెక్టర్ ఆరా

29-10-2026 | 05:15pm

నిర్మల్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్న అటవీ ప్రాంతం నుంచి కమలానగర్ వరకు అటవీశాఖ అధికారులు నిర్వహిస్తున్న భూముల సర్వేను (Land Survey) జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పరిశీలించారు. గండి రామన్న ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల సర్వేను పక్కాగా, పారదర్శకంగా (Transparency) నిర్వహించాలని సర్వే సిబ్బందికి సూచించారు. అటవీ భూముల సరిహద్దులను (Land Boundaries) కచ్చితంగా గుర్తించి, సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అటవీశాఖ, భూ రికార్డులు, సర్వే విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు