అంతా మా ఇష్టం.. బోర్డు పెట్టేది మేమే..!

27-10-2026 | 11:38am

చెత్త వేసేది మేమే..!

మరీ రు.500/ ఫైన్ కట్టేది ఎవరు..?

కాగజ్నగర్,(విజయక్రాంతి): అంతా మా ఇష్టం.. మున్సిపాలిటీలో అడిగేవారెవరు..?  బోర్డు మేమే ఏర్పాటు చేస్తాం.. జరిమానా  బోర్డు కూడామేమే పెడతాము. చెత్త చెదారం  కూడా మేమే వేస్తున్నాము. వివరాల్లోకి వెళితే  కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీ(Kaghaznagar Municipality)లో పారిశుద్ధ్య నిర్వహణ అధికారుల తీరు విచిత్రంగా ఉంది. రోడ్డు పక్కన చెత్త వేయరాదని, అలా ఎవరైనా చెత్తాచెదారం వేస్తే రు.500 జరిమానా విధిస్తున్నట్లు బోర్డు ఏర్పాటు చేశారు.

కానీ అక్కడ చెత్తాచెదారం వేసేది  మున్సిపల్ పరిశుద్ధ(Municipal sanitation) నిర్వాహకులు మాత్రమే. పట్టణంలోని బాలాజీ నగర్-వినయ్ గార్డెన్ మధ్యగల రోడ్డు పక్కన చెత్తాచెదారంను మున్సిపల్ సిబ్బంది వేస్తున్నారు. ఈ వ్యవహారం గత కొంతకాలంగా కొనసాగుతుంది. రోడ్డు గుండా వచ్చి వెళ్లేవారు ఇక్కడ చెత్త వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మున్సిపల్ అధికారుల వ్యవహార శైలిపై విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు