పైప్ లైన్ లీకేజీ.. మంచినీరు బంద్

24-10-2026 | 10:09pm

కాగజ్ నగర్ ,అక్టోబర్ 24 (విజయక్రాంతి) : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ మున్సిపాలిటీలో(Kagaznagar Municipality)  శనివారం మంచి నీటి సరఫరా(Water supply) నిలిచిపోయింది. ప్రధాన పైప్ లైన్ కు లీకేజీ(Leakage in the pipeline) కారణంగా మంచినీటి సరఫరాను అధికారులు ఆపేశారు. దీంతో పట్టణంలోని బాలాజీ నగర్, ద్వారక నగర్ ,కౌసర్ మసీద్, మార్కెట్ ఏరియాలకు మంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు మంచి నీటి  కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై మున్సిపల్ ఇంజనీర్ నవీన్ కుమార్ ను వివరణ కోరగా ప్రధాన  పైప్ లైన్ కు లీకేజ్ ఏర్పడడంతో శనివారం నాడు మరమ్మతులు పూర్తి చేసి, తిరిగి ఆదివారం నుండి మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు