ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

27-09-2026 | 01:33pm

ఆసిఫాబాద్‌, సెప్టెంబర్‌ 27 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, గ్రంథాలయ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగా, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను స్మరించుకున్నారు.తెలంగాణ ప్రాంత అభివృద్ధి, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. నిరాడంబర జీవితం గడుపుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడిగా ఆయన సేవలను కొనియాడారు. యువత కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికారి నదీమ్,అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు