డీఎల్‌ఐ ప్రాజెక్టును రద్దు చేయాలని పాదయాత్ర

27-09-2026 | 01:30pm

పాలమూరును ఎడారిగా మార్చే ప్రయత్నాలను అడ్డుకుంటాం

పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన సమితి

కల్వకుర్తి సెప్టెంబర్ 27: పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నంలో భాగంగానే డీఎల్‌ఐ(DLI) (Dindi Lift Irrigation) ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతోందని  ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు.వంగూరు మండలం ఉల్పర గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉల్పర నుంచి కోనాపూర్‌, రంగాపూర్‌ మీదుగా కల్వకుర్తి వరకు రైతులు పాదయాత్రగా తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, నినాదాలు, ఆటపాటలతో పాదయాత్ర కొనసాగుతుంది.

ఈ సందర్భంగా డీఎల్‌ఐ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టడం వల్ల పాలమూరు ప్రాంతంలోని రైతులకు, సాగునీటి వనరులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సమితి సభ్యులు పేర్కొన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సాయంత్రం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకోనుంది. అనంతరం డీఎల్‌ఐ ప్రాజెక్టును రద్దు చేయాలని, పాలమూరు ప్రాంతంలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేయనున్నట్లు  తెలిపారు

మరిన్ని వార్తలు