నెట్‌వర్క్ షాక్.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్

27-09-2026 | 09:36am
  1. మండలంలో నిలిచిన కమ్యూనికేషన్ సేవలు
  2. మూగబోయిన ఏజెన్సీ మండలం
  3. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్

కన్నాయిగూడెం, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల(Kannayigudem Mandal) కేంద్రంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ టవల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం ఉదయం కాలిపోయింది. స్థానికులు గమనించి పోలీస్, అగ్నిమాపక  సిబ్బందికి సమాచారం అందించారు.. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు..టవర్ ఆవరణలో ఉన్న కంటైనర్ మాత్రమే కాలిపోయిందా టవర్ కి కూడా ఏమైనా నష్టం జరిగిందా అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

టవర్ పరిసరాలు పూర్తి పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగి ఉండటంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు చుట్టపు చూపుగా వచ్చి తాత్కాలిక పనులు చేస్తూ చేతులు దులుపుకోవడం వలన సంఘటన జరిగినట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కన్నాయిగూడెం మండలం కేంద్రంలో బిఎస్ఎన్ఎల్(Bharat Sanchar Nigam Limited) టవర్ ఒక్కటే మండల ప్రజలకు దిక్కు, ఇతర ఏ నెట్వర్క్ కూడా మండలంలో పనిచేయదు. ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి కన్నాయిగూడెం మండలంలో అత్యవసర సమయంలో సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి బిఎస్ఎన్ఎల్ టవర్ ను పునరుద్దరణ చేసి సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు