కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

09-09-2026 | 03:53pm

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 7 రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టనున్నారు. 5 రాష్ట్రాలు 14 జిల్లాలు కవర్ చేసేలా మూడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అరక్కోణం-రేణిగుంట సెక్షన్(Arakkonam-Renigunta section) లో 3,4 లేన్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. మూడేళ్లలో అరక్కోణం-రేణిగుంట సెక్షన్ లో 77 కి.మీ పొడువుతో 3,4 లేన్ల నిర్మాణం పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర కేబినెట్‌ సమావేశంలోని నిర్ణయాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Union Minister Ashwini Vaishnaw) మాట్లాడుతూ, "మనం అత్యంత ముఖ్యమైన రైల్వే కారిడార్లను పరిశీలిస్తే: 11,000 కిలోమీటర్ల పొడవైన, 7 హై-డెన్సిటీ కారిడార్లు, వీటిలో క్వాడ్రప్లింగ్, 4-లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఇంకా అనేక ఇతర కారిడార్లు కూడా ఉన్నాయి. రాబోయే కాలంలో ఇవి భారీ ట్రాఫిక్‌ను నిర్వహించబోతున్నాయి. ఢిల్లీ నుండి ముంబై, ముంబై నుండి చెన్నై, చెన్నై నుండి కోల్‌కతా, కోల్‌కతా నుండి ముంబై - ఇదే గోల్డెన్ క్వాడ్రిలేటరల్... ఈ 7 కారిడార్లు సుమారు 40శాతం రైల్వే ట్రాఫిక్‌ను నిర్వహిస్తాయి. ఈ కారిడార్లలో, సుమారు 2000 కిలోమీటర్ల మేర ఇప్పటికే 4-లైనింగ్ పూర్తయింది. సుమారు 5000 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయి లేదా ఇప్పటికే ఆమోదం పొందాయి. మరో 4000 కిలోమీటర్లు తుది అనుమతి ప్రక్రియలో ఉన్నాయి." మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు