వరి ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి
తాహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించిన బిజెపి నాయకులు
సుల్తానాబాద్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి అని, రైతులు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి, తాసిల్దార్ కువినతి పత్రం అందజేశారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు హాజరై మాట్లాడుతూ వరి కొనుగోలులో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు విక్రయించి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అన్నారు.
ధాన్యం కొనుగోలులో ఎలాంటి జాప్యం లేకుండా చూడటంతో పాటు, తూకం, గన్నీ సంచులు, రవాణా వంటి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించి, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను సకాలంలో రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అని అన్నారు.
అలాగే రైతుల సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వరి కొనుగోలు తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నదాతకు బిజెపి అండగా ఉంటుందని కడారి అశోక్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లంక శంకర్, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్,
జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు చాతరాజు రమేష్, కౌన్సిలర్ సమత కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు చిట్టవేణి సదయ్య, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాటూరీ లత, ప్రధాన కార్యదర్శి గుడ్ల వెంకటేష్, పసేడ్ల రవి, గుండ వెంకటేష్, ఓజ్జా సతీష్, మారం రమేష్, వల్స సాయికిరణ్, ఆగండ్ల శంకర్, తిరుపతి రావు, చాతరాజు అజయ్, చాతరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.