ప్రజల రక్షణే ప్రథమ ప్రాధాన్యం
- భద్రత ఉన్నప్పుడే రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు
- సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- టీజీఎస్పీఎఫ్ 36వ రైజింగ్‌డే పరేడ్‌లో పాల్గొన్న భట్టి
పటాన్చెరు/అమీన్పూర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్ర భద్రత, ప్రగతి పరస్పరం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, భద్రత ఉన్నప్పుడే రాష్ట్రానికి పెద్ద ఎత్తు న పెట్టుబడులు వస్తాయని, ప్రజల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్లో ఉన్న టీజీఎస్పీఎఫ్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించిన 36వ రైజింగ్ డే పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, పోలీసు కవాతును తిలకించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, నాగార్జునసా గర్ ప్రాజెక్టుతో పాటు ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర ప్రభు త్వ సంస్థలు కలిపి మొత్తం 67 కీలక సంస్థలకు దాదాపు రెండువేల మంది టీజీఎస్పీ ఎఫ్ సిబ్బంది నిరంతర సేవలు అందిస్తున్నారని కొనియాడారు. జైపూర్, యాదాద్రి, భద్రాద్రి కొత్తగూడెం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఎస్పీఎఫ్ అందిస్తున్న భద్రతా సేవ లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి వెలుగులు ఇస్తే.. ఆ వెలుగులను కాపాడే బాధ్యత ఎస్పీఎఫ్దే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా డ్రోన్లు, కృత్రిమ మేధ, ఆధునిక సీసీటీవీ కెమెరాలు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సిబ్బంది తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. ఎస్పీఎఫ్ బలగాల సంక్షేమానికి, వారి వృత్తిపరమైన అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు.
బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ భద్రతా రంగంలో విశేష సేవలందిస్తున్న సిబ్బందిని ఆ యన అభినందించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతా వ్యవస్థలు మరింత పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలు, ప్రజల ఆస్తులు, కీలక వ్యవస్థలకు రక్షణ కల్పించడంలో టీజీఎస్పీఎఫ్ సిబ్బంది పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ వేడుకల్లో టీజీఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.