సమన్వయం పెరగాలి
- నేరాల కట్టడికి దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలి: సీఎం రేవంత్
- పోలీసుశాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం
- తెలంగాణ పోలీస్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
- ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్లకు అవకాశం
- హైడ్రా సేవలను ప్రజలు అభినందిస్తున్నారు
- పోలీస్ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి
- కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణాది రాష్ట్రాల పోలీస్ అధికారుల సమావేశం ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పోలీసుశాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని, ప్రాణాలను పణంగా పెట్టి మరీ శాంతి భద్రతలను పోలీసులు రక్షిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టా యని ఆయన చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలు మరింత సమన్వయంతో పనిచేసి నేరాలను మరింతగా అరికట్టాలని, సురక్షితమైన దక్షిణ భారత్ కోసం మనమంతా కలిసి పనిచేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఇంటి గ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల స మన్వయ కమిటీ సమావేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సద స్సు ద్వారా రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
మంచి సమాజం కోసం పోలీసు శాఖలో సంస్కరణలు అవసరమని.. సమర్థవంతంగా, నైతిక విలువలతో, నిష్పక్షపా తంగా పనిచేసే పోలీసు వ్యవస్థను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారని సీఎం వివరించారు. ‘హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణలో వివిధ విభాగాలు పనిచేస్తున్నాయి. ఈ సదస్సు ద్వారా పోలీసు విభాగాల మెరుగైన సమన్వయానికి అవకాశం లభిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతో నేరా లు పూర్తిగా అరికట్టడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు’ అని ఆయన తెలిపారు.
దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని పోలీస్ అధికారులకు సీఎం సూచించారు. వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయాన్ని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలను, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.
పోలీస్ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం
పోలీస్ సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని.. సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదులు వంటివని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమర్థ, నిష్పక్షపాత పోలీసు వ్యవస్థనే ప్రజలు కోరుకుంటారని చెప్పారు. పోలీసింగ్ విధానాలు మారాలని, సంస్కరణలు నిరంతరం కొనసాగాలని అన్నారు. పోలీసుశాఖపై పెట్టే ఖర్చును పౌరుల భద్రతకు పెట్టుబడిగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘పోలీసుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తు నా అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటి. పోలీసు సిబ్బంది తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారు.
వారి పిల్లలకు దేశంలోని అత్యు త్తమ సైనిక్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండి యా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేశాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు, వారి హోదా, సర్వీసు ఆధా రంగా కనీసం రూ.1 కోటి నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిం చాం. అటువంటి కుటుంబాలకు గృహ నిర్మాణ స్థలాలు కేటాయిస్తున్నాం. అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని సీఎం వివరించారు.
నేరాల కట్టడిలో భేష్
ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు అత్యం త కీలకంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి విభాగం, ప్రతి ప్రత్యేక విభాగం సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణపై దృష్టి సారించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. తెలంగాణ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని.. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల నివా రణ, నక్సలిజం నిర్మూలన వంటి అన్ని రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు పొందుతున్నదని ఆయన వివరించారు.
ప్రధాని మోదీ నిర్వహించిన ప్రగతి సమీక్ష సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం లో నిలిచిందని, తెలంగాణను పూర్తిగా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో కృషి చేసిన మన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారని సీఎం పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ విభాగం కేంద్ర ప్రభుత్వం నుంచి 80 శాతానికి పైగా మార్కులు సాధించిందన్నారు.
బాధితులకు సైబర్ నేరాల ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించే విషయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని చెప్పారు. అమెరికాలోని ఎఫ్‌డీఏ తరహాలో ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణ కోసం వివిధ విభాగాల ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు టీజీ సేఫ్ అనే కొత్త విభాగాన్ని ప్రారంభించామన్నారు. చెరువులు, సరస్సులు, ఇతర జలవనరులను పరి రక్షించడం, పునరుద్ధరించడం, వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చిన హైడ్రా ప్రజల మన్ననలు పొందుతున్నదని తెలిపారు. హైదరా బాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు.
అప్పుడు అక్టోపస్.. ఇప్పుడు ఈగల్: డీజీపీ సీవీ ఆనంద్
నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు 1980 లో గ్రేహౌండ్స్ ఏర్పాటు చేశారని, ఇక్క డి విభాగానికి దేశవ్యాప్తంగా మంచి పేరుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిగాయని, ఇలాంటి తీవ్రవాద కార్యకలాపాలు అరికట్టేందుకు ఆక్టోపస్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మత్తుపదార్థాల నియంత్రణ కోసం ఇప్పుడు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, డ్రగ్స్ ముఠాలను పట్టుకునేందుకు అనేక ఆపరేషన్లు చేశామన్నారు. ఇటీవల జీరో నక్సల్ స్టేట్‌గా తెలంగాణ మారిందని డీజీపీ తెలిపారు. 824 మంది నక్సల్స్ లొంగిపోయారని, 302 ఆయుధాలు అప్పగించారన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రకృతి విపత్తుల్లో సమర్థంగా సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు. పోలీసులు ఉపయోగించే యాప్‌ను టీ స్పార్క్ పేరుతో అప్డేట్ చేశామని, మహిళల భద్రతకు ప్రత్యేక విభాగం పనిచేస్తున్నదని తెలిపారు.
సమావేశంలో కర్ణాటక డీజీపీ డాక్టర్ ఎంఏ సలీమ్, తమిళనాడు డీజీపీ డాక్టర్ మహేశ్ అగర్వాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ ఏడీజీ బీ శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ ఐజీపీ రవికృష్ణతోపాటు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట , లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, సీఐడీ డీజీ చారు సిన్హా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆపరేషన్స్ విభా గం డీజీ అనిల్ కుమార్ తదితరులు పాల్లొన్నారు.