ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం
09-10-2026 | 11:47am
మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల(RTC Union Elections) కోలాహలం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక కోసం కార్మికులు ఉదయం 5 గంటల నుండి ఓటు వేయడానికి బారులు తీరారు. 10 సంవత్సరాలకు పైగా ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వివిధ కార్మిక సంఘాలు తమ గుర్తింపు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.