బాలికల భద్రతపై సురక్ష పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

29-10-2026 | 04:10pm

విజయక్రాంతి /మూసాపేట్: జిల్లా ఎస్.పి. శ్రీమతి డి. జానకి(District S.P. Smt. D. Janaki) IPS గారి ఆదేశాల మేరకు, గురువారం  మూసాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో(Kasturba Gandhi School)  సురక్ష పోలీసు కళాబృందం, షీటీం, AHTU టీం వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలికల భద్రతపై సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి క్రమశిక్షణతో జీవిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. టీనేజ్ వయసులో అనవసరపు ఆకర్షణలకు, మొహా వ్యామోహాలకు లోనై విలువైన జీవితాన్ని, బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

చదువుకోవాల్సిన వయసులో చదువుపైనే దృష్టి పెట్టాలని, బాల్య వివాహాల వల్ల బాలికల జీవితం దుర్భరంగా మారుతుందని, అలాంటి ఘటనలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టం – 2012, సైబర్ భద్రత గురించి వివరించి, సోషల్ మీడియా ద్వారా అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్టులు, వీడియో కాల్స్, ఫోటోలు షేర్ చేయడంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా 1930, 112 నంబర్ల ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

బాలికలు ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, అవసరమైతే “నో” అని స్పష్టంగా చెప్పడం, ఒంటరిగా ఉన్నప్పుడు అనుమానాస్పద పరిస్థితుల్లో సహాయం కోరడం చాలా ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ  షీటీం నంబర్ 8712659365 ను నిర్భయంగా సంప్రదించాలని అన్నారు.

మానవ అక్రమ రవాణా (Human Trafficking), అక్రమ దత్తత వంటి నేరాలు మరియు మహిళల హెల్ప్ డెస్క్, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ గురించి వివరించారు. AHTU NO; 8712680066 సంప్రదించి సహాయం పొందాలని సూచించారు.

కార్యక్రమంలో KGBV SO పావని సింగ్ గారు ఉపాధ్యాయులు,  షీటీం అధికారి శ్రీమతి జయరాణి ASI గారు, AHTU టీం శ్రీమతి సక్రి బాయి ASI గారు, వరప్రసాద్ PC పోలీసు కళాబృందం సభ్యులు D.రాములు HC, బాల్ రాజ్ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు