కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు
సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్
బెజ్జంకి, అక్టోబర్22: మండలంలో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్(CPM Mandal Secretary Thipparapu Srinivas) అన్నారు. గురువారం బెజ్జంకిలోని ఏఈ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపి, విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వరి పంట చివరి దశలో నీరు అవసరమైన సమయంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్‌ను 24 గంటలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి సాయికృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం, కుంట సత్తయ్య, గాజరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.