5 September, 2026 | 2:55 PM

గురువులే సమాజానికి మార్గదర్శకులు: ఎస్పీ డి.జానకి

05-09-2026 | 01:44pm

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 5: గురుపూజోత్సవం(Teachers Day) సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పరిధిలోని పోలీస్ లైన్ హైస్కూల్‌(Police Lines High School)లో ఉపాధ్యాయులను జిల్లా ఎస్పీ డి.జానకి(SP D. Janaki) ఐపీఎస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, ఆర్‌ఐలు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు