ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

17-09-2026 | 08:13pm

మహమ్మదాబాద్, గండీడ్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day), ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. సల్కర్‌పేట్‌లోని గండీడ్ మండల బీజేపీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు కె. విజయ్‌కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి విమోచన పోరాట వీరులకు నివాళులర్పించారు.

అనంతరం రంగారెడ్డిపల్లి, కొమ్మిరెడ్డిపల్లి మీదుగా గండీడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో కార్యకర్తలు ‘భారతమాతకు జై’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం దేశభక్తి స్ఫూర్తిని చాటే రోజని అన్నారు.

మరిన్ని వార్తలు