పాలిటెక్నిక్ మైనింగ్ విద్యార్థులకు ఆటోక్యాడ్ పై శిక్షణ
శిక్షణా తరగతులు ప్రారంభం వారం రోజులు శిక్షణ
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(Government Polytechnic College) మైనింగ్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులపై శిక్షణ చేపట్టారు. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MEAI)(Mining Engineers Association of India) సౌజన్యంతో గురువారం ఆటోక్యాడ్ (AutoCAD) శిక్షణ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.
ఈ కార్యక్రమానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), మందమర్రి ఏరియా డీజీఎం వేముల మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ (FAC), మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎం. దేవేందర్ మారాం కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. వారం రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ ద్వారా విద్యార్థులకు ఆటోక్యాడ్పై ప్రాయోగిత పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందుతాయరాయన్నారు. భవిష్యత్తులో పరిశ్రమల్లోఉద్యోగావకాశాలకు అవసరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థులు శిక్షణా కార్యక్రమాన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటో క్యాడ్ శిక్షకులు దినకర్, మైనింగ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE), ఎలక్ట్రానిక్స్అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (EIE), ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ (AR) విభాగాల అధిపతులు, మైనింగ్ విభాగ అధ్యాపకులు, ఫైనల్ ఇయర్ మైనింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.