కమిషనర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు
19-09-2026 | 04:57pm
నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (Municipal Corporation Commissioner)పై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు (District Collector Kumar Deepak) మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంపీ వంశీ కృష్ణ వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు శని వారం ఫిర్యాదు చేశారు. శుక్రవారం పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి తొలగించడం సరైంది కాదని, దళిత ఎంపీ ఫ్లెక్సీలను ఎలాంటి సమాచారం లేకుండా కార్పొరేషన్ కమిషనర్, సిబ్బంది తొలగించడం పట్ల విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ కౌన్సిలర్లు వేముల సంజీవ్, సుర్మిల్ల వేణు, ఆగల్డ్యూటి రాజు, నాయకులు సుదమల్ల అశోక్ తేజ తదితరులున్నారు.