బెల్లంపల్లి లో టీ ఆర్పీ జెండా ఎగురేస్తాం..
తీన్మార్ మల్లన్న పాదయాత్రకు భారీ మద్దతు
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): తెలంగాణ లో యేండ్లుగా అగ్రవర్ణాల రెడ్డీ, రావుల పాలన సాగుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి అన్నారు. తెలంగాణ బహుజన రాజ్యాధికారం కొరకు తీన్మార్ మల్లన్న చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా కోణంపేట నుండి నెన్నెల,బెల్లంపల్లి, తాండూర్ మండల కేంద్రాల్లో బైక్ యాత్ర నిర్వహించారు. ముఖ్య అతిధి గా జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి లొ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం వలన ప్రజలకు ఒరిగిందేం లేదని మండిపడ్డారు.
ఎమ్మెల్యే పై సొంత కార్యకర్తలు తిరుగుబాటు చేయడం విడ్డురంగా ఉందని విమర్శించారు. మండలాల్లో ఎమ్మెల్యే పేరుతో అగ్రవర్ణాల నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో టీఆర్పీ జెండా ఎగుర వేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలొ తాండూర్ మండల అధ్యక్షులు అనిల్, నెన్నెల అధ్యక్షులు మహేష్, సోషల్ మీడియా ఇంచార్జి లతీఫ్, యువ నాయకులు నరేష్, బానేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.