చేగుంటలో ‘ఐఐఎఫ్‌ఎల్ గోల్డ్ లోన్’ శాఖ ప్రారంభం
24-09-2026 | 05:21pm
చేగుంట, సెప్టెంబర్ 24 విజయక్రాంతి: చేగుంట పట్టణ కేంద్రం లో , ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్ ఎల్ )(India Infoline Finance Limited) నూతన గోల్డ్ లోన్ శాఖను గురువారం అసోసియేటెడ్ జోనలో హెడ్ ప్రవీణ్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు, వ్యాపారులకు, అత్యవసర ఆర్థిక అవసరాల కోసం గోల్డ్ లోన్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని . వినియోగదారులకు నాణ్యమైన, వేగవంతమైన పారదర్శక సేవలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మహంకాళి టెంపుల్ అధ్యక్షులు సండ్రుగు సతీష్, ఉపసర్పంచ్, రఫీ ,టెరిటరీ మేనేజర్ గజ్జెల అనిల్, మెదక్ బ్రాంచ్ మేనేజర్ టి. విజయ్ కుమార్, ఐఐఎఫ్‌ఎల్ సిబ్బంది ఎన్. రజని కుమారి, కె. దాస్, కె. వరుణ్ కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.