జీవిక స్టీల్‌ పరిశ్రమపై రైతుల ఆగ్రహం

26-10-2026 | 02:42pm

చేగుంట అక్టోబర్ 26, (విజయక్రాంతి): చేగుంటలో పట్టణ కేంద్రం లో గల జీవిక స్టీల్ పరిశ్రమ(Jivika Steel Industry) వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తూ రైతులు కంపెనీ ముందు 3 వ రోజు వంట వార్పు కార్యక్రమం లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సి,ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య ధర్నా లో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 

 జీవిక స్టీల్ పరిశ్రమతో చుట్టూ గ్రామాలలో తీవ్ర నీటి కాలుష్యం(Water pollution), వాయు కాలుష్యం ఏర్పడుతోందని, వ్యవసాయ పంట పొలాల్లో దుమ్ము,ధూళితో పంటలు నష్టపోతున్నాయని రైతులు, ఉల్లితిమ్మయి పల్లి, చుట్టూ ఉన్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం రైతులు, గ్రామస్తులు, బిఅర్ఎస్ నాయకులు కలిసి కంపెనీ ముందు టెంట్ వేసి వంట వార్పు  చేపట్టారు. వెంటనే కంపెనీ అనుమతులు రద్దు చేసి జీవిక కంపెనీని తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు