ఉస్మానియా యూనివర్సిటీ క్రాస్ కంట్రీలో మహేంద్రహిల్స్ సత్తా
మహిళల విభాగంలో ద్వితీయ స్థానం కైవసం
ఘట్ కేసర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్(ఘట్ కేసర్ సర్కిల్,), ఎదులాబాద్ డివిజన్ పరిధి, అంకుశాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల(Social Welfare Residential Women's Degree College) మహేంద్రహిల్స్(Mahendra Hills) విద్యార్థినులు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) లో నిర్వహించిన అంతర్ కళాశాల మహిళల క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో ద్వితీయ స్థానం సాధించి సత్తా చాటారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ సింథటిక్ ట్రాక్‌లో(Osmania University Synthetic Track) నిర్వహించిన 10 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో కళాశాలకు చెందిన సౌమ్య, సింధు, నందిని, రేవతి, రాధిక, ఉమ్రా పాల్గొని సమిష్టి కృషితో జట్టు రెండవ ఛాంపియన్‌షిప్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మి విజేతలను అభినందించి, మెడల్స్ వేసి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కళాశాలలో ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. క్రమశిక్షణ, నిరంతర సాధన, కోచ్‌ల మార్గదర్శకత్వంతోనే ఈస్థాయి విజయాలు సాధ్యమవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థినులు యూనివర్సిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మరిన్ని పతకాలు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రత్యూష, స్పోర్ట్స్ ఇంచార్జ్ సవిత, అధ్యాపక బృందం, అథ్లెటిక్స్ కోచ్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.