నుష్రత్ భరూచాకు ఏమైంది?

03-10-2026 | 01:25pm

బాలి నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి

ముంబై: బాలీవుడ్ నటి నుష్రత్ భరూచాకు(Nushrratt Bharuccha Accident) ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. బాలి పర్యటనలో ఉండగా జరిగిన ప్రమాదంలో ఆమె వెన్నెముకకు ఫ్రాక్చర్ అయినట్లు ఆమె బృందం వెల్లడించింది. ప్రమాదం తర్వాత బాలి ఆస్పత్రిలో చికిత్స పొందిన నుష్రత్‌ను మెరుగైన వైద్యం కోసం తాజాగా ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తీసుకొచ్చారు. ముంబై చేరుకున్న తర్వాత నుష్రత్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

వైద్యుల పరిశీలన అనంతరం స్పైన్ సర్జరీ(Nushrratt Bharuccha Spine Fracture) చేయనున్నట్లు ఆమె బృందం తెలిపింది. ప్రస్తుతం ఆమెకు అవసరమైన వైద్య చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యమని టీమ్ పేర్కొంది. నుష్రత్ భరూచా బాలి వెళ్లింది వర్క్ కమ్ హాలిడే ట్రిప్ కోసం. అక్కడే ప్రమాదం జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మొదట బాలి ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన అనంతరం, తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలించే ఏర్పాట్లు చేశారు. Nushrratt Bharuccha Health Update, Bali Accident, Nushrratt Bharuccha Mumbai Hospital వంటి అంశాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె టీమ్ తాజా ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు