హోటల్‌లో షాకింగ్ సీన్!
ఇన్‌స్టాలో పరిచయం.. హోటల్‌లో ఊహించని ట్విస్ట్!
హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం చివరకు విషాదంగా మారింది. హన్మకొండలో పీజీ పీడియాట్రిక్స్(PG Pediatrics) మొదటి సంవత్సరం చదువుతున్న 27 ఏళ్ల వైద్య విద్యార్థిని కె. సృజన మియాపూర్‌లోని(Miyapur Hotel Murder) ఓ హోటల్ గదిలో మృతిగా కనిపించడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన సృజన సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. సృజనకు కొన్నేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవికుమార్‌తో పరిచయం ఏర్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన వద్ద ఉన్న బంగారు గొలుసును తిరిగి ఇస్తానని చెప్పడంతో ఆమె హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. ఇద్దరూ మియాపూర్‌లోని ఓ హోటల్‌లో కలుసుకున్నారని, ఆ తర్వాత రవికుమార్ హోటల్ నుంచి వెళ్లిపోయి కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు.
సృజనతో ఫోన్‌లో సంబంధాలు తెగిపోవడంతో ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు దర్యాప్తు ప్రారంభించి మొబైల్ లొకేషన్ ఆధారంగా మియాపూర్‌లోని హోటల్‌ను గుర్తించారు. అక్కడ గది తెరిచి చూడగా సృజన(PG Medical Student) మృతదేహం కనిపించింది. దీంతో కేసు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రవికుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ లొకేషన్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. సృజన మరణానికి ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక తర్వాత స్పష్టమవుతుందని పోలీసులు చెబుతున్నారు.