ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి

30-09-2026 | 11:32pm

పునరుజీవన ప్రాజెక్టు ద్వారా ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి

మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి మండల పరిధిలోని మూసీ నది ప్రక్షాళన(Musi River Project), సమగ్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ భూముల సేకరణకు సంబంధించి బుధవారం ఆర్‌డీఓ నల్ల వెంకట్ రెడ్డి(RDO Venkata Reddy), తహసీల్దార్ వెంకట్ నర్సింహ రెడ్డి  సమక్షంలో రైతులతో నెగోషియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్‌డీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవన ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో పరివాహక ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయిఅని, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.

భూములు కోల్పోతున్న రైతులకు(Farmers ) చట్టప్రకారం చెల్లించాల్సిన పరిహారం,ఇతర పునరావాస ప్రయోజనాలపై స్పష్టతనిచ్చారు. భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని అధికారులు హామీ ఇచ్చారు.ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి, భూసేకరణ ప్రక్రియకు రైతులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, ప్రభావిత ప్రాంతాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు