విమర్శకులకు రెహమాన్ స్ట్రాంగ్ కౌంటర్
ఐస్‌క్రీమ్ అమ్ముకోండి.. విమర్శలపై ఏఆర్ రెహమాన్ షాకింగ్ కామెంట్స్!
రామాయణం సినిమా మ్యూజిక్‌పై వస్తున్న విమర్శలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో స్పందించారు. సినిమాలోని మంగళ్ రంగ్ పాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ.. “అందరినీ మెప్పించాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోండి” అని అన్నారు. తన Creative Process గురించి వివరిస్తూ.. ఒక Music Composition తుది రూపం దాల్చడానికి నెలల సమయం పట్టొచ్చని రెహమాన్ చెప్పారు. తన పనిని మొదట విమర్శించుకునేది తానేనని, ఏదైనా సంగీతాన్ని ఒక్క రోజులో నిర్ణయించలేమని పేర్కొన్నారు.
కొన్ని పాటలు పచ్చళ్ల మాదిరిగా కాలం గడిచే కొద్దీ మరింత బాగుంటాయని ఆసక్తికరంగా వివరించారు. మంగళ్ రంగ్ పాటలోని Musical Arrangement, Qawwali ప్రభావం, Electronic Musicపై కొందరు శ్రోతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై స్పందించిన రెహమాన్.. ఒక సంగీత కూర్పులోని ఒక్క అంశాన్ని మాత్రమే చూసి మొత్తం ఆలోచనను అంచనా వేయకూడదని అభిప్రాయపడ్డారు. ఇదే ఇంటర్వ్యూలో హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో కలిసి రామాయణం కోసం పనిచేయడం, ఐదు భాషలు, రెండు వెర్షన్లతో భారీ Background Score సిద్ధం చేయడం గురించి కూడా వెల్లడించారు.