ప్రజలకు బీజేపీ చీఫ్ పిలుపు

02-11-2026 | 11:13am

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. లక్ష మందితో బీజేపీ భారీ ప్లాన్!

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah padayatra) సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రకు భారీగా తరలిరావాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(Ramchander Rao) రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజకీయ అంశాలపై పార్టీ తన గళాన్ని వినిపించనుందని తెలిపారు.

'సేవ్ డెమోక్రసీ' నినాదంతో దేశవ్యాప్త ప్రచారం

బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన 'Save Democracy and Defeat and Remove Anarchy' ప్రచారంలో భాగంగా అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. ఈ Campaignలో భాగంగా నగరంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, అరాచక రాజకీయాలను ఓడించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌పై రామచందర్ రావు విమర్శలు

ఓటర్ల జాబితాల Special Intensive Revision (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని రామచందర్ రావు ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలు, వాటి అధికారాలకు సంబంధించిన అంశాల్లోనూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే బీజేపీ ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అమిత్ షా పాల్గొనే ఈ మహా పాదయాత్రకు సుమారు లక్ష మంది హాజరవుతారని రామచందర్ రావు అంచనా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


మరిన్ని వార్తలు