బొగ్గు ఉత్పత్తికి బూస్ట్
ఆత్మనిర్భర్ దిశగా భారత్.. బొగ్గు దిగుమతుల్లో భారీ కోత
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో 2026 ఆగస్టులో దేశ బొగ్గు దిగుమతులు 5.83 శాతం తగ్గినట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో 111.05 మిలియన్ టన్నులుగా ఉన్న Coal Imports.. ఈ ఏడాది అదే నెలలో 104.57 మిలియన్ టన్నులకు పడిపోయాయి. ముఖ్యంగా దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో Blending కోసం చేసుకునే దిగుమతులు ఏకంగా 35.23 శాతం తగ్గడం గమనార్హం.
దేశీయంగా Coal Production పెంచడం, బొగ్గు రవాణా కోసం Evacuation Infrastructure బలోపేతం చేయడం, Supply Chain Efficiency మెరుగుపరచడం వంటి చర్యలతో ఈ తగ్గుదల సాధ్యమైందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పరిణామం దేశ Energy Securityని మరింత బలోపేతం చేయడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఇంధన రంగంలో Self-Reliance సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తన X పోస్టులో వెల్లడించారు.