ఆరు రౌండ్ల ఫైరింగ్.. హేమంత్ రెండు కాళ్లు తొలగించారా?
అనంతపురం: రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అడవుల్లో అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై హేమంత్ కత్తితో దాడికి పాల్పడ్డాడు (Attack). ఈ ఘటనలో రాప్తాడు సీఐ చేతికి గాయాలయ్యాయి. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు (Firing) జరిపారు.
కాల్పుల్లో గాయపడిన హేమంత్‌ను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనను బతికించాలని పోలీసులను వేడుకున్నట్లు సమాచారం. అయితే కాల్పుల కారణంగా నిందితుడి రెండు కాళ్లు తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
మరోవైపు, రాప్తాడు ఘటనలో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో బాధిత విద్యార్థిని స్వగ్రామమైన అయ్యవారిపల్లిలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి తమ ఆనందాన్ని (Celebrations) వ్యక్తం చేశారు.