హారర్ థ్రిల్లింగ్ అంశాలతో ‘పోతిరెడ్డిపల్లి’
చాక్లెట్ స్టార్ పవన్(Chocolate star Pawan) హీరోగా, మౌనిక, సిరి(Mounika, Siri) హీరోయిన్లు నటిస్తున్న నూతన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి(Pothireddypalli)’. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇరుముడి ఫేం సాయి స్వరూప్, సునీతా మనోహర్, ఆనంద్, బలగం రమేశ్, సూర్య తేజవత్, రామలింగం, అరుణ్ అఖిల్, శేఖర్, తను, మనీష్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తుండగా, ఉద్ధవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి మాజీ డిఫ్యూటీ సీఎం రాజయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, సీనియర్ నటుడు బాబుమోహన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్, డైరెక్టర్లు వీఎన్ ఆదిత్య, వీ సముద్ర, ఓయూ శంకర్ గుండేటి తదితర సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.