ఆకాశానికి సన్నబియ్యం ధరలు
- కాంగ్రెస్ సర్కార్ నేలచూపులు
- ధరల నియంత్రణలో విఫలం
- సమీక్షించి చర్యలు తీసుకోవాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణలో సన్నబియ్యం ధరలు(Prices of fine-grain rice) భారీగా పెరుగుతుంటే రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ మాత్రం నేల చూ పులు చూస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) మం డిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరో పించారు. సన్నబియ్యం ధరలు నాలుగు నెలల్లోనే సుమారు 25 శాతం వరకు పెరిగాయని పేర్కొం టూ.. వెంటనే ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించి నియంత్రణ చర్యలు చేపట్టాలని సోమవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
నిత్యవసర ధరల నియంత్రణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే... ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ మొద్దు నిద్రలోనే ఉండటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న బియ్యం ధరలు కేవలం నాలు గు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం.. మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సిం దిపోయి.. బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటులున్నాయని నిలదీశారు.
మీరు ఇస్తున్న సన్న బియ్యం పథకం సఫలమైతే ఎందుకు బియ్యం ధరలు అదుపు తప్పుతున్నాయని, మీరు ఇస్తున్న నాణ్యత లేని సన్న బియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాక మరేమిటని ప్రశ్నించారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు ఎంఎస్‌పీ పేరిట దక్కుతున్నది నామమాత్రపు ధర.. కానీ మధ్య దళారులకు దక్కుతున్నది క్వింటాల్‌కు రూ. 8 వేలకు పై మాటే అని తెలిపారు.
రైతుకు గిట్టుబాటు ధర లేదు.. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు.. లాభపడుతున్నది మాత్రం మధ్య దళారులు అని స్పష్టం చేశారు. బియ్యం మాత్రమే కాదు.. ఉల్లి రూ. 70, వెల్లుల్లి రూ. 240, పల్లినూనె రూ. 210, పెసరపప్పు రూ. 125, కందిపప్పు రూ. 165.. ధరలు అడ్డగోలుగా పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలని నిలదీశారు. ప్రజలు జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం కాదు.. వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.