శ్రీవిష్ణు మార్క్ కామెడీ పక్కా..

06-10-2026 | 05:35am

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్ మెంట్’ శ్రీవిష్ణు పీరియడ్ ఎలిమెంట్స్(Sree Vishnu's period elements), హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్(Comrade Kalyan)’తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇందులో మహిమా నంబియార్(Mahima Nambiar) హీరోయిన్. అక్టోబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను కథానాయకి మహిమా నంబియార్(Mahima Nambiar) విలేకరులతో పంచుకుంది. “తొలిసారి తెలుగులో నటించడం సరికొత్త అనుభవం. నేను ఏదైనా భాషను త్వరగా నేర్చుకోగలను.

తెలుగు నాకు అర్థమవుతుంది. అలాగే ప్రతి లైన్‌కు దర్శకుడిని అడిగి అర్థం తెలుసుకుంటాను. ఈ సినిమాలో శ్రీవిష్ణు సిగ్నేచర్ స్టైల్లో ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. శ్రీవిష్ణు చాలా స్పాంటేనిటీ ఉన్న యాక్టర్. షూటింగ్ స్పాట్‌లో చాలా ఇంప్రొవైజ్ చేస్తుంటారు. అది నాకు మరింత ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఆయన తెలుగును అర్థం చేసుకోవడం నాకు కష్టం (నవ్వుతూ). ఆయనకు ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. నిజంగా అంత స్పాంటేనిటీ ఉన్న యాక్టర్‌తో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్. ఇంతకుముందు శ్రీవిష్ణుతో నేను ‘సామజవరగమన’ చేయాల్సింది.

ఆ సినిమా కోసం ఫొటోషూట్ కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడీ సినిమాతో శ్రీవిష్ణుతో కలిసి తెలుగులో డెబ్యూ చేయడం లక్కీగా ఫీలవుతున్నా. ప్రతి భాషలో కొత్తకొత్త పాత్రలు చేయాలనే నా ఉద్దేశం. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ దేనికవే ప్రత్యేకం. -ఇందులో నాది చాలా ఫన్ క్యారెక్టర్. పాత్ర పేరు సితారదేవి. పక్కింటి అమ్మాయిలాంటి పాత్ర.

ఒడిశా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తా. ఆ భాష కారణంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే వినోదం చాలా గమ్మత్తుగా ఉంటుంది. కథ 90ల బ్యాక్‌డ్రాప్‌లో చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇందులో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను చాలా కామికల్‌గా డీల్ చేశారు. కొత్త ప్రాజెక్టులు.. మలయాళం, తమిళ్‌లో ఒక్కో సినిమా చేస్తున్నా. తెలుగు కథలు వింటున్నా” అని తెలిపింది. 

మరిన్ని వార్తలు