పాఠశాలలో సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన

30-09-2026 | 06:05pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి):మండలంలోని జవహర్‌నగర్ గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో(Kasturba Gandhi Girls' School) బుధవారం సైబర్ క్రైమ్, డ్రగ్స్ మరియు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు డీఎస్పీ రవీందర్, ములుగు సీఐ సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే విధానాలు, ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం, బాలికల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంపై వివరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న బాలికలందరికీ వాటర్ బాటిళ్లను అందజేశారు. విద్యార్థులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన పెంచుకుని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక ఎస్సై చల్లా రాజు తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు