పదవీ విరమణ పొందిన శంకర్‌కు ఘన సన్మానం

30-09-2026 | 06:02pm

తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకుడిగా సేవలు

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): నాగల్‌గిద్ద పాఠశాల కాంప్లెక్స్(Nagalgidda School Complex) ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించిన మల్లెల శంకర్ పదవీ విరమణ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన శంకర్ ఉపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం సేవలందించి విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.

పదవీ విరమణ కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్‌రెడ్డి, మహారెడ్డి విజయపాల్‌రెడ్డి హాజరై శంకర్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శంకర్ విద్యారంగానికి విశేష సేవలందించడంతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో నారాయణఖేడ్ జేఏసీ నాయకుడిగా పనిచేసి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.

ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. ‘నారాయణఖేడ్ కోదండరాముడిగా’ పేరు తెచ్చుకున్న శంకర్ పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవంతో సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కార్యదర్శి జీవన్ రాథోడ్, పీఆర్టీయూ అధ్యక్షుడు రమేష్, నర్సింలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిద్ధారెడ్డి,

కారాముంగి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డి, కరస్‌గుత్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు హీరమన్, ఉపాధ్యాయులు రవీందర్‌రావు, బాబుశెట్టి, విజయేందర్‌రెడ్డి, నాగ్నాథ్, గణపతి చౌహాన్, రాము, కాశీనాథ్ జాదవ్, నర్సింలు, బాసెట్, అశోక్, ఉప సర్పంచ్ ధనరాజ్, దిగంబర్, లింగమేష్, సంగమేష్, కొఠారి నరసింహులు, నర్సయ్య, సంతోష్‌తో పాటు మండలంలోని పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు